Kollu Ravindra: జీవో 217పై ప్రభుత్వం మొండిగా ముందుకు వెళితే మత్స్యకారులు తెడ్డు తిరగేస్తారు: కొల్లు రవీంద్ర

  • జీవో 217 నేపథ్యంలో కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు
  • జీవోతో మత్స్యకారుల పొట్టకొడుతున్నారని ఆగ్రహం
  • సొసైటీలు ఉనికి కోల్పోతాయని ఆందోళన
  • జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
Kollu Ravindra warns AP govt

సీఎం జగన్ జీవో 217 తీసుకువచ్చి మత్స్యకారుల పొట్టకొడుతున్నారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర మరోసారి ధ్వజమెత్తారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ జీవో వల్ల సుమారు 650 నుంచి 700 వరకు ఉన్న మత్స్యకార సొసైటీలు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువులను ఆన్ లైన్ టెండరింగ్ చేయడం వల్ల దళారులు వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. జీవో 217ని రద్దు చేసేవరకు తమ పోరాటం ఆగదని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు ఇచ్చే రూ.4 వేలను కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వడంలేదని ఆరోపించారు. రాష్ట్రంలో దాదాపు 30 వేలమంది మత్స్యకారులకు మత్స్యకార భరోసా అందడంలేదని విమర్శించారు. ప్రభుత్వం ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని, మొండిగా ముందుకు వెళితే మత్స్యకారులు తెడ్డు తిరగేస్తారని హెచ్చరించారు.

More Telugu News