Somu Veerraju: టీటీడీ బోర్డు నుంచి ఆ 52 మందిని తొలగించండి: గవర్నర్ ను కోరిన సోము వీర్రాజు

  • టీటీడీకి జంబో బోర్డు
  • 52 మంది ప్రత్యేక ఆహ్వానితులకు చోటు
  • కొత్త సంస్కృతికి తెరలేపారంటూ సోము వీర్రాజు వ్యాఖ్యలు
  • గవర్నర్ ను కలిసి వినతిపత్రం సమర్పణ
Somu Veerraju met AP Governor

ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో భారీ ఎత్తున ప్రత్యేక ఆహ్వానితులకు చోటు కల్పించారంటూ ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. జగన్ ఆధ్వర్యంలో వైసీపీ సర్కారు టీటీడీ బోర్డు విషయంలో గతంలో ఎన్నడూలేని కొత్త సంస్కృతికి తెరదీసిందని ఆరోపించారు. సాధారణ బోర్డుకు అదనంగా 52 మంది ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో టీటీడీ బోర్డును ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని విమర్శించారు.

ఎంతో ప్రాశస్త్యం కలిగిన హిందూ దేవాలయాల విషయంలో, ధార్మిక చింతనకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి రాజకీయ చర్యలను తాము నిరసిస్తున్నామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

ప్రభుత్వం నియమించిన 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కోరామని వెల్లడించారు. ఈ మేరకు వినతిపత్రం అందించామని తెలిపారు. టీటీడీ అంశంపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.

More Telugu News