Hyderabad: హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ పున‌రుద్ధ‌ర‌ణ

  • గ‌ణేశుడి విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం వేళ నిన్న వాహ‌నాల దారిమ‌ళ్లింపు
  • ఎన్టీఆర్‌ మార్గ్‌ నుంచి తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌కు రాక‌పోక‌ల పున‌రుద్ధ‌ర‌ణ‌
  • ఖైరతాబాద్‌ వైపుగా వాహ‌నాలు వెళ్లే ర‌హ‌దారుల‌పై కూడా
  • ప్ర‌స్తుతం పీవీ మార్గ్‌లో నిమజ్జన వాహనాలకు మాత్రమే అనుమతి
no traffic restrictions in hyd

హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌లో గ‌ణేశుడి విగ్ర‌హాల నిమ‌జ్జ‌నాల నేప‌థ్యంలో నిన్న ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించిన విష‌యం తెలిసిందే. ప‌లు ప్రాంతాల్లో వాహ‌నాల‌ను దారి మ‌ళ్లించారు. ప్ర‌స్తుతం ట్యాంక్ బండ్‌కు గ‌ణేశుడి విగ్ర‌హాల తాకిడి త‌గ్గ‌డంతో ఆ ప్రాంతంలో సాధారణ రాకపోకలను పునరుద్ధరించినట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ తెలిపారు.

అక్క‌డి ఎన్టీఆర్‌ మార్గ్‌ నుంచి తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌, ఖైరతాబాద్‌ వైపున‌కు ర‌హ‌దారుల‌పై సాధార‌ణ‌ వాహనాల‌ను అనుమ‌తిస్తున్న‌ట్లు చెప్పారు. హైదరాబాద్ ప‌రిధి నుంచే కాకుండా రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్ల పరిధి నుంచి గ‌ణేశుడి విగ్రహాల రద్దీ ఉన్నట్లు ఆయ‌న చెప్పారు. ప్ర‌స్తుతం పీవీ మార్గ్‌లో నిమజ్జన వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు వివ‌రించారు. అయితే, కాసేప‌ట్లో ఆ రహదారిని కూడా క్లియర్‌ చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News