ముదిరిన వివాదం.. పరువునష్టం దావా వేసిన కేటీఆర్

20-09-2021 Mon 11:38
  • రేవంత్, కేటీఆర్ ల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు
  • చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించానన్న కేటీఆర్
  • అపరాధులు బుక్ అవుతారని వ్యాఖ్య
KTR files defamation suit in court
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ ల మధ్య వివాదం మరింత ముదిరింది. ఇప్పటి వరకు సవాళ్లు, ప్రతి సవాళ్లతో కొనసాగిన వివాదం ఇప్పుడు కోర్టు మెట్లెక్కింది. ఈరోజు తాను చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించానని... కోర్టులో పరువునష్టం దావా వేశానని కేటీఆర్ ప్రకటించారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని... అబద్ధాలను కోర్టు రుజువు చేస్తుందని, అపరాధులు తగిన విధంగా బుక్ అవుతారని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్ లో ఎక్కడా కూడా నేరుగా రేవంత్ రెడ్డి పేరును పేర్కొనకపోవడం గమనార్హం. ఈ ట్వీట్ కు రేవంత్ ఎలా ప్రతిస్పందిస్తారో వేచి చూడాలి.