Chhattisgarh: చత్తీస్‌గఢ్ మాజీ మంత్రి రాజీందర్ పాల్‌సింగ్ ఆత్మహత్య

  • ఈ ఏడాది మార్చిలో కరోనా
  • కోలుకున్న అనంతరం చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలు
  • ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య
Chhattisgarh Former BJP ministers body found hanging from fan

కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న చత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, బీజేపీ నేత రాజీందర్‌పాల్‌సింగ్ (72) ఆత్మహత్య చేసుకున్నారు. రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని ఖుజ్జి అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజీందర్.. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ తొలి ప్రభుత్వంలో వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. ఈ ఏడాది మార్చిలో కరోనా బారినపడిన ఆయన చికిత్స అనంతరం కోలుకున్నారు.

 అయితే, ఆ తర్వాతి నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రాజ్‌నంద్‌గావ్ జిల్లా చురియా పట్టణంలో తన నివాసంలో భాటియా ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. అయితే, ఆయన నివాసం నుంచి సూసైడ్ నోట్ లభించిందా? లేదా? అన్న విషయాన్ని పోలీసులు నిర్ధారించలేదు. రాజీందర్ భార్య కొన్నేళ్ల క్రితమే చనిపోగా, ఆయన కుమారుడు జగ్జీత్‌సింగ్ భాటియా రాయ్‌పూర్‌లో ఓ ఆసుపత్రి నిర్వహిస్తున్నారు.

More Telugu News