ఏపీలో పూర్తయిన పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలిచిందంటే..!

20-09-2021 Mon 07:57
  • 7,219 ఎంపీటీసీ స్థానాల్లో 5,998 వైసీపీకే
  • 826 స్థానాలతో సరిపెట్టుకున్న టీడీపీ
  • 515 జడ్పీటీసీ స్థానాల్లో 502 చోట్ల వైసీపీ విజయ భేరి
  • ఆరింటికే పరిమితమైన టీడీపీ
YSRCP Clean Sweep in MPTC ZPTC Elections

ఆంధ్రప్రదేశ్‌లో నిన్న ఉదయం ప్రారంభమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి దాటాక పూర్తయింది. రాత్రి రెండు గంటల సమయంలో అధికారులు ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 7,219 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరగ్గా 5,998  స్థానాలను వైసీపీ గెలుచుకుంది. 826 స్థానాల్లో టీడీపీ విజయం సాధించగా, జనసేన 177, బీజేపీ 28, సీపీఎం 15, సీపీఐ 8, స్వతంత్రులు 157 స్థానాల్లో విజయం సాధించారు. అలాగే, 515 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా వైసీపీ 502, టీడీపీ 6, జనసేన 2, సీపీఎం, స్వతంత్రులు చెరో స్థానంలో విజయం సాధించారు.