సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

20-09-2021 Mon 07:28
  • 'చంద్రముఖి' సీక్వెల్ లో అనుష్క!
  • సంక్రాంతికి ముందుగా 'ఆచార్య'
  • కమల్ 'విక్రమ్' తాజా షెడ్యూలు  
Anushka plays Chandramukhi in sequel

*  గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో వచ్చిన 'చంద్రముఖి' చిత్రం ఎంతటి విజయం సాధించిందో మనకు తెలుసు. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ చేయడానికి దర్శకుడు వాసు సన్నాహాలు చేస్తున్నారు. లారెన్స్ హీరోగా నటించే ఈ సీక్వెల్ లో కథానాయిక పాత్రకు అనుష్కను సంప్రదించినట్టు, తాజాగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
*  మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కలయికలో రూపొందుతున్న 'ఆచార్య' చిత్రాన్ని సంక్రాంతికి ముందుగా అంటే జనవరి మొదటి వారంలోనే విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. జనవరి 7 లేదా 8 తేదీల్లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. చిరంజీవి సరసన కాజల్ నటించగా.. చరణ్ పక్కన పూజ హెగ్డే జంటగా నటించింది.
*  ప్రముఖ నటుడు కమలహాసన్ నటిస్తున్న 'విక్రమ్' చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ నిన్నటి నుంచి చెన్నైలో జరుగుతోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్ సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై దీనిని నిర్మిస్తుంన్నారు.