పరిషత్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ స్పందన

19-09-2021 Sun 22:16
  • ఏపీలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • సోమవారం ఉదయం నాటికి పూర్తి ఫలితాలు
  • వైసీపీ ఆధిక్యం సుస్పష్టం
  • అందరికీ కృతజ్ఞతలు తెలిపిన సీఎం జగన్
CM Jagan responds to Parishat election results

ఏపీలో పరిషత్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ స్పందించారు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇంతటి అఖండ విజయం సాధ్యమైందని వినమ్రంగా తెలిపారు. ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం పట్ల, ప్రతి మనిషి పట్ల తన బాధ్యతను మరింత పెంచాయని పేర్కొన్నారు. సోమవారం ఉదయం కల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ పూర్తి ఫలితాలు వస్తాయని సీఎం జగన్ వెల్లడించారు. పూర్తి ఫలితాలు వచ్చాక మరోసారి అందరికీ వీడియో సందేశం ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటానని ట్వీట్ చేశారు.