తెలంగాణలో మరింత తగ్గిన రోజువారీ కొవిడ్ కేసులు

19-09-2021 Sun 20:50
  • గత 24 గంటల్లో 35,160 కరోనా పరీక్షలు
  • 173 మందికి పాజిటివ్
  • జీహెచ్ఎంసీ పరిధిలో 64 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 5,005 మందికి చికిత్స
Corona details of Telangana
తెలంగాణలో కరోనా వ్యాప్తి మరింత తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో 35,160 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 173 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 64 కేసులు వెల్లడయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 18, కరీంనగర్ జిల్లాలో 17, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు గుర్తించారు. వనపర్తి, నిర్మల్, నారాయణపేట, నాగర్ కర్నూల్, ములుగు, కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 315 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,63,454 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,54,545 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 5,005 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 3,904కి పెరిగింది.