బ్యాటింగ్‌లో ధోనీ మరింత బాధ్యత తీసుకోవాలి: విండీస్ దిగ్గజం

19-09-2021 Sun 19:38
  • రవీంద్ర జడేజా, మొయీన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్ ఆడలేకపోతే కష్టమన్న ఇయాన్ బిషప్
  • ఆ సమయంలో ధోనీనే జట్టును ఆదుకోవాలని కామెంట్
  • అంగీకరించిన కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్
Dhoni need to take more responsibility as a batsman says Ian Bishop
ఐపీఎల్ రెండో సెషన్ ప్రారంభమైంది. చెన్నై, ముంబై జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ సిరీస్ మొదలైంది. ఈ క్రమంలో చెన్నై జట్టు సారధి మహేంద్ర సింగ్ ధోనీపై వెస్టిండీస్ మాజీ బౌలర్ ఇయాన్ బిషప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రవీంద్ర జడేజా, మొయీన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్ కనుక ఆడలేకపోతే జట్టు బాధ్యతను ధోనీనే తీసుకోవాలని బిషప్ చెప్పాడు. బ్యాట్స్‌మెన్‌గా ధోనీ మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.

ఈ విషయంలో ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా బిషప్‌తో ఏకీభవించాడు. చెన్నై జట్టు బ్యాటింగ్ పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉందని అన్నాడు. ధోనీ విషయంలో బిషప్ మాటలతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పాడు.

కాగా, ఐపీఎల్-2021 రెండో సెషన్‌లో తొలి మ్యాచ్ ఆదివారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ధోనీ సారధ్యంలో చెన్నై జట్టు మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీ ఎగరేసుకుపోయిన సంగతి తెలిసిందే.