ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ ఈ నెలాఖరు వరకు పొడిగింపు

19-09-2021 Sun 17:39
  • రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ
  • సెప్టెంబరు 30 వరకు పొడిగించిన ప్రభుత్వం
  • ఉత్తర్వులు జారీ
  • ఏపీలో ఇప్పటికీ 1000కి పైగా రోజువారీ కేసులు
AP Govt once again extended night curfew

ఏపీలో కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాత్రిపూట కర్ఫ్యూను మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం రాత్రిపూట 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కొనసాగుతున్న కర్ఫ్యూ ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో ఇప్పటికీ వెయ్యికి పైగానే రోజువారీ కరోనా కేసులు వస్తున్నాయి. అందువల్లే ప్రభుత్వం కర్ఫ్యూ కొనసాగింపు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో రోజువారీ కేసులు 500కి దిగువనే నమోదవుతుండగా, ఏపీలో మాత్రం 1000 దాటుతున్నాయి.