MPTC: ఏపీలో కొనసాగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

  • ఏపీలో నేడు పరిషత్ ఓట్ల లెక్కింపు
  • స్పష్టంగా కనిపిస్తున్న వైసీపీ ప్రభంజనం
  • దరిదాపుల్లోని లేని టీడీపీ
  • పరిషత్ ఎన్నికలు బహిష్కరించిన టీడీపీ
  • అయినా పలుచోట్ల బరిలో దిగిన టీడీపీ వర్గీయులు
MPTC and ZPTC votes counting continues in AP

ఏపీలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం... 9589 ఎంపీటీసీ స్థానాలకు గాను వైసీపీ 5,859 స్థానాల్లో విజయం సాధించగా, టీడీపీ 531, జనసేన పార్టీ 30, బీజేపీ 19, ఇతరులు 112 చోట్ల నెగ్గారు. 641 జడ్పీటీసీ స్థానాలకు గాను 235 స్థానాల్లో వైసీపీ, 2 స్థానాల్లో టీడీపీ గెలిచింది. మిగిలిన స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

అధికార వైసీపీ ప్రభంజనం పరిషత్ ఎన్నికల్లోనూ కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో టీడీపీ ఖాతా తెరవనే లేదు. మొత్తం 52 జడ్పీ స్థానాలను వైసీపీ హస్తగతం చేసుకుంది. నెల్లూరు జిల్లాలో 46 జడ్పీ స్థానాలను వైసీపీ వర్గీయులే చేజిక్కించుకుని క్లీన్ స్వీప్ చేశారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు గతంలో టీడీపీ అధినాయకత్వం ప్రకటించినా, పలుచోట్ల ఆ పార్టీ నేతలు బరిలో దిగడం తెలిసిందే.

More Telugu News