కమెడియన్ అలీ ఇల్లు చూస్తే "వావ్" అంటారు!

19-09-2021 Sun 16:07
  • కమెడియన్ గా పేరుప్రఖ్యాతులు సంపాదించిన అలీ
  • అన్ని హంగులతో కూడిన ఇంట్లో అలీ నివాసం
  • అలీ ఇంట్లో జిమ్, స్విమ్మింగ్ పూల్, హోం థియేటర్
  • యూట్యూబ్ చానల్ ప్రారంభించిన అలీ అర్ధాంగి
Comedian Ali house tour promo

స్టార్ కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత నాలుగు దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను తన హాస్యంతో గిలిగింతలు పెడుతున్నాడు. అలీ అర్ధాంగి జుబేదా కొన్నిరోజుల కిందటే తన పేరిట యూట్యూబ్ చానల్ ప్రారంభించి ఆసక్తికరమైన వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఆమె తమ నివాసానికి సంబంధించిన వీడియో ప్రోమో విడుదల చేశారు.

అలీ హోమ్ టూర్ పేరిట రూపొందించిన వీడియో తాలూకు ప్రోమోకు విశేషమైన స్పందన వస్తోంది. నిన్న ప్రోమో రిలీజ్ చేయగా, ఇప్పటికే 21 వేలకు పైగా వ్యూస్ లభించాయి.

అలీ ఇంటి విశేషాలను పరిశీలిస్తే... ఏ స్టార్ హీరో నివాసానికి తీసిపోని విధంగా ఉంది. ఓ గది నిండా అలీకి వచ్చిన అవార్డులే ఉన్నాయి. ఆ అవార్డులు ఎప్పుడెప్పుడు వచ్చాయో అలీ వివరించడం ఈ వీడియోలో చూడొచ్చు. అంతేకాదు, అత్యాధునిక సౌకర్యాలతో హోం థియేటర్, జిమ్, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్టు వంటి సౌకర్యాలు అలీ నివాసంలో ఉన్నాయి. వీటన్నింటినీ చూపిస్తూ అలీ అర్ధాంగి జుబేదా ఈ హోమ్ టూర్ వీడియో రూపొందించారు.