తిరుపతిలో కుప్పకూలిన టీటీడీ స్వాగత ఆర్చి... తప్పిన పెనుప్రమాదం

19-09-2021 Sun 15:16
  • రామానుజ సర్కిల్ కు వెళ్లే దారిలో ఘటన
  • ఆర్చికి తగిలిన టిప్పర్ పై భాగం
  • కారు ముందు భాగంపై పడిన ఆర్చి
  • తృటిలో తప్పించుకున్న కర్ణాటక భక్తులు
TTD welcome arch collapsed in Tirupathi

తిరుపతిలో నేటి మధ్యాహ్నం భయానక ఘటన చోటుచేసుకుంది. బస్టాండ్ ప్రాంతం నుంచి రామానుజ సర్కిల్ కు వెళ్లే రోడ్డులో ఓ భారీ ఆర్చి కుప్పకూలింది. టీటీడీ నిర్మించిన ఈ స్వాగత ఆర్చి ఓ కారు ముందు భాగంపై పడడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. కారు కొంచెం ముందుకు వెళ్లినప్పుడు ఆర్చి పడి ఉంటే తీవ్ర నష్టం జరిగేదని భావిస్తున్నారు.

ఈ ఘటనలో కారు ముందు భాగం ధ్వంసమైంది. ఓ టిప్పర్ పైభాగం ఆర్చికి తగలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఆ కారు కర్ణాటకకు చెందిన భక్తులదని గుర్తించారు. ఈ ప్రమాద ఘటనతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది.