Naga Sanyasirao: ఎంపీటీసీగా గెలిచాడు... పాపం, ఓట్ల లెక్కింపుకు ముందే మరణించాడు!

Who wins as MPTC was died before votes counting
  • విశాఖ జిల్లాలో కొనసాగుతున్న పరిషత్ ఓట్ల లెక్కింపు
  • నాగులపల్లి ఎంపీటీసీగా నాగ సన్యాసిరావు విజయం
  • 775 ఓట్ల తేడాతో గెలిచిన సన్యాసిరావు
  • ఇటీవల అనారోగ్యంతో మరణించిన వైనం
విశాఖ జిల్లాలో ఓ ఎంపీటీసీ అభ్యర్థి ఎన్నికల్లో గెలిచినా, ఆయనిప్పుడు ప్రాణాలతో లేరు. విశాఖ జిల్లాలో పరిషత్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, నాగులపల్లి ఎంపీటీసీ స్థానం నుంచి నాగ సన్యాసిరావు విజయం సాధించారు. ఎంపీటీసీగా 775 ఓట్ల తేడాతో గెలిచారు. బాధాకరమైన విషయం ఏమిటంటే... నాగ సన్యాసిరావు ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూశారు.

కొన్నాళ్ల కిందట పరిషత్ ఎన్నికల పోలింగ్ జరగ్గా, కోర్టు తాజా ఆదేశాలతో ఓట్ల లెక్కింపు ఇప్పుడు చేపట్టారు. కానీ తన ఫలితాన్ని చూసుకోవడానికి నాగ సన్యాసిరావు ఇప్పుడు లేరు. ఆయన గెలుపు నేపథ్యంలో కుటుంబ సభ్యులు మరింత బాధకు లోనయ్యారు.
Naga Sanyasirao
Death
MPTC
Nagulapalli
Visakhapatnam District

More Telugu News