ఏపీలో ఎంపీపీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ల ఎన్నికకు నోటిఫికేషన్

19-09-2021 Sun 14:50
  • ఏపీలో కొనసాగుతున్న పరిషత్ ఓట్ల లెక్కింపు
  • నేటి రాత్రికి పూర్తి ఫలితాలు
  • ఈ నెల 24న ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక
  • ఈ నెల 25న జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక
Notification for MPP Presidents and ZP Chairman

ఏపీలో నేడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, రాత్రి కల్లా పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక మండల, జిల్లా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఎవరన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో, ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు ఎస్ఈసీ నుంచి నోటిఫికేషన్ వెలువడింది.

ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక జరగనుంది. అనంతరం ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటలకు జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక చేపట్టనున్నారు. ఈ మేరకు ఎన్నికకు ఏర్పాట్లు చేయాలని ఎస్ఈసీ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు.