మ‌రోసారి రికార్డు ధ‌ర ప‌లికిన బాలాపూర్ ల‌డ్డూ

19-09-2021 Sun 10:32
  • వేలం పాట‌లో రూ.18.90 ల‌క్ష‌లు
  • సొంతం చేసుకున్న‌ మ‌ర్రి శ‌శాంక్ రెడ్డి, ర‌మేశ్ యాద‌వ్
  • కొన‌సాగుతోన్న గ‌ణేశ్ శోభాయాత్ర
ganesh laddoo action on balapur
హైద‌రాబాద్‌లోని బాలాపూర్ ల‌డ్డూ మ‌రోసారి రికార్డు ధ‌ర ప‌లికింది. వేలం పాట‌లో ఆ ల‌డ్డూ రూ.18.90 ల‌క్ష‌లకు అమ్ముడుపోయింది. ఈ ల‌డ్డూను మ‌ర్రి శ‌శాంక్ రెడ్డి, ర‌మేశ్ యాద‌వ్ ద‌క్కించుకున్నారు. కాగా, హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం కోసం పోలీసులు న‌గ‌ర వ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.  

నగరంలో ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్ వెళ్లే వైపుగా శోభాయాత్రలో పాల్గొనే వాహనాలను మిన‌హా ఇతర వాహనాలను అనుమతించట్లేదు. గత ఏడాది కరోనా వల్ల గణేశ్ శోభాయాత్ర‌ ఉత్సవాలు జరగలేదన్న విష‌యం తెలిసిందే. ఈ సారి హైదరాబాద్‌లోని నలుమూలల నుంచి ప్రజలు ట్యాంక్ బండ్ కు గ‌ణేశ్ నిమ‌జ్జ‌నాల కోసం వ‌స్తున్నారు.