శునకంతో విమాన ప్రయాణం.. బిజినెస్ కేబిన్ మొత్తాన్ని బుక్ చేసుకున్న ప్రయాణికుడు
- ఎయిర్ ఇండియా విమానంలోని 12 బిజినెస్ క్లాస్ సీట్లను బుక్ చేసుకున్న ప్రయాణికుడు
- ముంబై నుంచి చెన్నైకి వచ్చేందుకు రూ. 2.50 లక్షలు వెచ్చించిన వైనం
- పెంపుడు జంతువుల ప్రయాణానికి ఎయిర్ ఇండియా మాత్రమే అనుమతి
ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో శునకాలతో గతంలోనూ పలువురు ప్రయాణించారు. అయితే, దాని కోసం బిజినెస్ క్లాస్ కేబిన్ మొత్తాన్ని బుక్ చేసుకోవడం మాత్రం ఇదే తొలిసారి. అంతేకాదు, పెంపుడు జంతువులతో కలిసి ప్రయాణించేందుకు అనుమతించే విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మాత్రమే. ఒక విమానంలో గరిష్ఠంగా రెండు పెంపుడు జంతువులకు మాత్రమే అనుమతి ఉంది. అది కూడా చివరి వరుసలో ప్రయాణానికి మాత్రమే అనుమతి ఉంది. గతేడాది జూన్-సెప్టెంబరు మధ్య ఎయిర్ ఇండియా దేశీయ విమానాల్లో 2,000 పెంపుడు జంతువులు ప్రయాణించాయి.