ఓ సాధారణ పౌరుడిలా దుకాణానికి వెళ్లి ఇష్టమైనవి ఆరగించిన రాష్ట్రపతి

18-09-2021 Sat 21:44
  • ఓ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ కు 50 ఏళ్లు
  • నాలుగు రోజుల పర్యటనకు విచ్చేసిన రామ్ నాథ్ కోవింద్
  • సిమ్లాలో సందడి చేసిన వైనం
  • పర్యాటకులతో ముచ్చట
President Ramnath Kovind tours in Simla
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నాలుగు రోజుల పర్యటన కోసం నిన్న సిమ్లా విచ్చేశారు. హిమాచల్ ప్రదేశ్ కు రాష్ట్ర హోదా లభించి 50 ఏళ్లయిన సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. నిన్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రథమ పౌరుడు రామ్ నాథ్ కోవింద్ తన పర్యటనను ఆస్వాదిస్తున్నారు.

సిమ్లాలో హెచ్ పీఎంసీ దుకాణానికి వెళ్లిన ఆయన ఓ సాధారణ పౌరుడిలా నచ్చినవి ఆరగించారు. పాప్ కార్న్ కొనుక్కుని ఎంతో ఇష్టంగా తిన్నారు. పలు ప్రాంతాల్లో పర్యాటకులను కలిసి వారితో ముచ్చటించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఎంతో చనువుగా తమతో మాట్లాడడం పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించింది.