Nikhileswar: 2020 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రదానం

  • తెలుగు రచయిత నిఖిలేశ్వర్ కు అకాడమీ అవార్డు
  • అగ్నిశ్వాస రచనకు గాను విశిష్ట పురస్కారం
  • దిగంబర కవుల్లో ఒకరిగా పేరుప్రఖ్యాతులు
  • వీరప్ప మొయిలీకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
Kendra Sahithya Academy awards presentation

2020 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను నేడు ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా 24 భాషలకు చెందిన ప్రఖ్యాత రచయితలకు సాహిత్య పురస్కారాలు అందించారు. సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న వారిలో తెలుగు రచయిత నిఖిలేశ్వర్ కూడా ఉన్నారు. అగ్నిశ్వాస రచనకు గాను నిఖిలేశ్వర్ కు ఈ అవార్డు లభించింది. నిఖిలేశ్వర్ తెలుగులోనే కాకుండా, హిందీ, ఇంగ్లీషు భాషల్లోనూ రచనలు చేశారు.  

నిఖిలేశ్వర్... నగ్నముని, జ్వాలాముఖి, చెరబండరాజు, మహాస్వప్న, భైరవయ్య వంటి దిగంబర కవుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. నిఖిలేశ్వర్ అసలు పేరు కె.యాదవరెడ్డి.

ఇక, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీకి కూడా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. బాహుబలి అహింసా దిగ్విజయం కవితా రచనకు గాను వీరప్ప మొయిలీని ఈ అవార్డు వరించింది.

More Telugu News