బిగ్ బాస్ ఇంటి సభ్యులను రామ్ చరణ్ కు పరిచయం చేసిన నాగార్జున

18-09-2021 Sat 20:58
  • బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ కు చీఫ్ గెస్టుగా రామ్ చరణ్
  • ప్రోమో విడుదల చేసిన స్టార్ మా చానల్   
  • వేదికపై సందడి చేసిన చరణ్
  • నాగ్ తో కలిసి వినోదం
Host Nagarjuna introduces Bigg Boss contestants to hero Ramcharan
టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ బిగ్ బాస్-5 తాజా ఎపిసోడ్ లో సందడి చేశారు. హోస్ట్ నాగార్జున విచ్చేసిన ఈ ఎపిసోడ్ కు రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ మేరకు స్టార్ మా చానల్ ప్రోమో రిలీజ్ చేసింది.  తాను ఇవాళ లోబో తరహాలో డ్రెస్ చేసుకుని వచ్చానని రామ్ చరణ్ వెల్లడించారు. ఈ సందర్భంగా నాగ్... ఒక్కొక్క కంటెస్టెంట్ ను చెర్రీకి పరిచయం చేశారు. ఇంటి సభ్యులతో వినోదం పంచుతూనే, మరోవైపు వారికి చురకలు అంటిస్తూ నాగ్ తాజా ఎపిసోడ్ ను రక్తికట్టించినట్టు ప్రోమో చెబుతోంది.