నంద్యాలలో రెండ్రోజుల వ్యవధిలో ఇద్దరి హత్య... తీవ్ర భయాందోళనల్లో స్థానికులు!

18-09-2021 Sat 19:09
  • తొలుత వ్యాపారి వెంకటసుబ్బయ్య హత్య
  • బాలాజీ కాంప్లెక్స్ లో నరికి చంపిన దుండగులు
  • తాజాగా రౌడీ షీటర్ నాగ త్రిలోచన్ హత్య
  • అతడి ఇంట్లోనే చంపిన దుండగులు
Two murders in Nandyal town within two days

కర్నూలు జిల్లా నంద్యాలలో రెండ్రోజుల వ్యవధిలో ఇద్దరు దారుణహత్యకు గురయ్యారు. తొలుత వ్యాపారి తిరువీధి వెంకటసుబ్బయ్య హత్యకు గురికాగా, తాజాగా రౌడీ షీటర్ నాగ త్రిలోచన్ (30) ను దుండగులు అతడి ఇంట్లోనే హత్య చేశారు. పట్టణంలోని దేవ నగర్ లో ఈ ఘటన జరిగింది. నాగ త్రిలోచన్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు అంటున్నారు.

అంతకుముందు తిరువీధి వెంకటసుబ్బయ్యను నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో వేటకొడవళ్లతో నరికి చంపారు. వెంకట సుబ్బయ్య జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ ఘటనతో భయాందోళనలకు  గురైన నంద్యాల ప్రజలు, తాజాగా రౌడీ షీటర్ నాగ త్రిలోచన్ హత్యతో మరింత హడలిపోతున్నారు.