సెన్సార్ పూర్తి చేసుకున్న 'రిపబ్లిక్'

18-09-2021 Sat 18:54
  • కలెక్టర్ పాత్రలో సాయితేజ్
  • పొలిటికల్ లీడర్ గా రమ్యకృష్ణ
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ
  • అక్టోబర్ 1వ తేదీన సినిమా రిలీజ్
Censore work completed for Republic movie
సాయితేజ్ కథానాయకుడిగా 'రిపబ్లిక్' సినిమా రూపొందింది. భగవాన్ - పుల్లారావు నిర్మించిన ఈ  సినిమాకి దేవ కట్టా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సాయితేజ్ జోడీగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. ఈ సినిమాను అక్టోబర్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. కలెక్టర్ పాత్రను సాయితేజ్ పోషించిన ఈ సినిమాలో, పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ గా రమ్యకృష్ణ కనిపించనున్నారు. ఈ ఇద్దరి మధ్య సవాళ్లతో ఈ కథ నడుస్తుందని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో జగపతిబాబు ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.