Ravi Shastri: ఇదొక్కటి సాధిస్తే.. అంతకు మించిన ఆనందం నాకు లేదు: రవిశాస్త్రి

Will be very happy if India wins T20 World Cup
  • హెడ్ కోచ్ గా అనుకున్న దాని కంటే ఎక్కువ సాధించాను
  • టీ20 ప్రపంచకప్ ను సాధిస్తే ఎంతో సంతోషిస్తా
  • భారత్ గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తా
టీమిండియా హెడ్ కోచ్ గా తాను అనుకున్నదాని కన్నా ఎక్కువే సాధించానని రవిశాస్త్రి ఆనందాన్ని వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచకప్ ను సాధిస్తే అంతకు మించిన ఆనందం తన జీవితంలో లేదని అన్నారు. తన నేతృత్వంలో టీమిండియా ఐదేళ్లు టెస్ట్ క్రికెట్ లో నెంబర్ వన్ గా కొనసాగిందని చెప్పారు. ఆస్ట్రేలియాలో రెండు సార్లు విజయాలను సాధించడమే కాకుండా... ఇంగ్లండ్ ను వారి సొంత గడ్డపై ఓడించిందని అన్నారు.

ఇంగ్లండ్ పర్యటనలో లార్డ్స్, ఓవల్ మైదానాల్లో ఇండియా విజయం సాధించడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని చెప్పారు. టీ20 ప్రపంచకప్ సాధిస్తే తనకు ఎంతో సంతోషంగా ఉంటుందని అన్నారు. ఈ ప్రపంచకప్ లో భారత్ విజేతగా నిలిచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. టీ20 ప్రపంచకప్ తర్వాత హెడ్ కోచ్ గా రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది.
Ravi Shastri
BCCI
T20 World Cup

More Telugu News