Samantha: తిరుమల శ్రీవారిని, శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న సమంత

tollywood actress samantha visits tirumala and srikalahasthi
  • వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి దర్శనం
  • శ్రీకాళహస్తిలో మహాన్యాస రుద్రాభిషేకంలో పాల్గొన్న నటి
  • తీర్థప్రసాదాలు, జ్ఞాపిక అందజేసిన అర్చకులు
టాలీవుడ్ ప్రముఖ నటి, అక్కినేని కోడలు సమంత నేడు చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు. మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకంలో పాల్గొన్న సమంత అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. వేదపండితులు ఆమెను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జ్ఞాపికను బహూకరించారు.

అలాగే, ఈ ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకున్న సమంత వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. కాగా, సమంత నటించిన 'శాకుంతలం' సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. అలాగే, తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. తాజాగా, ఓ వెబ్ సిరీస్‌కు కూడా సమంత సైన్ చేసినట్టు తెలుస్తోంది.
Samantha
Sri Kalahasthi
Chittoor District
Tirumala

More Telugu News