'సువర్ణభూమి' బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్

17-09-2021 Fri 21:19
  • 'సువర్ణభూమి' ఫ్యామిలీలో చేరిన రామ్ చరణ్
  • ప్రచాకర్తగా వ్యవహరించేందుకు ఒప్పందం
  • కె.విశ్వనాథ్, రామ్ చరణ్ పై యాడ్ షూట్
  • త్వరలో బుల్లితెరపై సందడి చేయనున్న యాడ్
Ram Charan as Suvarnabhumi brand campaigner

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సువర్ణభూమి ఇన్ ఫ్రా డెవలపర్స్ సంస్థకు టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు సువర్ణభూమి సంస్థతో రామ్ చరణ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. గతంలో సువర్ణభూమి సంస్థకు కె.విశ్వనాథ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి ప్రముఖులు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు. ప్రస్తుతం కె.విశ్వనాథ్ తో కలిసి రామ్ చరణ్ కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు.

వీరిద్దరిపై ఇప్పటికే ఓ యాడ్ కూడా రూపొందించారు. ఇది త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనుంది. భారీ సినిమాలతో బిజీగా ఉండే రామ్ చరణ్... వాణిజ్యపరమైన ఒప్పందాల విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీకి ప్రచారకర్తగా వ్యవహరించేందుకు రూ.5 కోట్లకు ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది.