పంజాబ్ రాజకీయాల్లో సిద్దూ రాఖీసావంత్ లాంటి వాడు: 'ఆప్' విమర్శ

17-09-2021 Fri 19:15
  • సిద్దూపై తీవ్ర విమర్శలు గుప్పించిన రాఘవ్ చద్దా
  • అమరీందర్ కు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ సిద్దూకి తలంటిందని ఎద్దేవా
  • అందుకే ఇప్పుడు కేజ్రీవాల్ పై పడ్డారని విమర్శ
AAP compares Navjot Singh Sidhu with Rakhi Sawant

పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూపై ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో రాఖీసావంత్ లాంటి వాడు సిద్దూ అంటూ ఎద్దేవా చేశాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను విమర్శిస్తూ సిద్దూ తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. వ్యవసాయ సంస్కరణల విషయంలో కేజ్రీవాల్ ని సిద్దూ తప్పుపట్టారు.

ఈ నేపథ్యంలో ఆయనపై రాఘవ్ చద్దా మండిపడ్డారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు వ్యతిరేకంగా మాట్లాడిన రోజున సిద్దూని కాంగ్రెస్ హైకమాండ్ తలంటిందని ఆయన అన్నారు. అందుకే కాస్త భిన్నంగా ఈరోజు కేజ్రీవాల్ మీద ఆయన పడ్డారని దుయ్యబట్టారు.