'లవ్ స్టోరీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా చిరూ!

17-09-2021 Fri 19:00
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
  • దూసుకుపోయిన 'సారంగధరియా' పాట
  • ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు
  • ఈ నెల 24వ తేదీన సినిమా విడుదల  
Chiranjeevi is guest for Love Story Pre Release Event

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య - సాయిపల్లవి జంటగా 'లవ్ స్టోరీ' సినిమా రూపొందింది. ఈ సినిమా ఎప్పుడో సిద్ధమైనా, కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు.

నారాయణ దాస్ నారంగ్ - రామ్మోహన్ ఈ సినిమాను నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా చిరంజీవి రానున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి - నాగార్జున మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకి పవన్ సీహెచ్ సంగీతాన్ని అందించాడు. 'సారంగధరియా' పాట ఒక రేంజ్ లో జనంలోకి దూసుకుపోయింది. 'ఫిదా' తరువాత శేఖర్ కమ్ముల - సాయిపల్లవి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. దేవయాని .. రవి రమేశ్ .. పోసాని ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.