ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

17-09-2021 Fri 18:19
  • 24వ తేదీనే బీఏసీ సమావేశం
  • 10 రోజుల్లో సమావేశాలను ముగించే యోచనలో ప్రభుత్వం
  • ఒకటి, రెండు రోజుల్లో గవర్నర్ ను కలవనున్న కేసీఆర్
TS Assembly sessions starts from Sep 24

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభంకానున్నాయి. 24 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అదే రోజున బీఏసీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల అజెండాను బీఏసీ ఖరారు చేయనుంది. అయితే ఎక్కువ రోజులు కాకుండా 10 రోజుల్లోనే సమావేశాలను ముగించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.

అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఒకటి, రెండు రోజుల్లో గవర్నర్ తమిళిసైని కేసీఆర్ కలవనున్నారు. తాజా పరిస్థితులపై కూడా గవర్నర్ తో కేసీఆర్ చర్చించనున్నారు.