'భీమ్లా నాయక్' నుంచి రానా ఫస్టు లుక్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్!

17-09-2021 Fri 17:27
  • షూటింగు దశలో 'భీమ్లా నాయక్'
  • టైటిల్ సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్
  • రానా అప్ డేట్ కి సన్నాహాలు
  • జనవరి 12వ తేదీన సినిమా విడుదల  
Bheemla Nayak movie update

పవన్ కల్యాణ్ - రానా ప్రధాన పాత్రధారులుగా 'భీమ్ల నాయక్' సినిమా రూపొందుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. సితార బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా, మలయాళంలో హిట్ కొట్టిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కి రీమేక్. ఈ సినిమా నుంచి వచ్చిన పవన్ పోస్టర్లకు .. టైటిల్ సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

దాంతో రానా లుక్ ఎలా ఉండనుంది? డేనియల్ శేఖర్ గా ఆయన పాత్ర స్వరూప స్వభావాలు ఎలా ఉండనున్నాయి? అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో రానాకి సంబంధించిన అప్ డేట్ ను ఈ నెల 20వ తేదీన ఇవ్వనున్నట్టుగా, ఈ సినిమా టీమ్ అధికారిక ప్రకటన చేసింది. రానా లుక్ ను రివీల్ చేయకుండా ఒక పోస్టర్ ను వదిలింది. ఈ నెల 20వ తేదీన రానా అభిమానులు ఖుషీ అయ్యేలా ఇంట్రెస్టింగ్ అప్ డేట్ మాత్రం వచ్చేస్తోందన్న మాట. జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.