వైసీపీ నేతలపై చంద్రబాబు కావాలనే దాడులు చేయిస్తున్నారు: మల్లాది విష్ణు

17-09-2021 Fri 17:00
  • జగన్ పై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
  • శాంతియుతంగా నిరసన చేపట్టిన జోగి రమేశ్ పై దాడి చేశారు
  • నీచ రాజకీయాలకు టీడీపీ కేరాఫ్ అడ్రస్ గా మారింది
Chandrababu is provoking to attack on YSRCP leaders says Malladi Vishnu

ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు గూండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇంటి వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టేందుకు తమ ఎమ్మెల్యే జోగి రమేశ్ యత్నిస్తే... ఆయనపై టీడీపీ శ్రేణులు దాడికి తెగబడ్డాయని అన్నారు. జోగి రమేశ్ పై దాడి బాధాకరమని... తక్షణమే టీడీపీ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

నీచ రాజకీయాలకు టీడీపీ కేరాఫ్ అడ్రస్ గా మారిందని అన్నారు. వైసీపీ నేతలపై చంద్రబాబు కావాలనే దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని కుట్రలకు చంద్రబాబే కారణమని చెప్పారు. అధికారంలో లేకపోతే ఇన్ని దాడులకు యత్నిస్తారా? అని దుయ్యబట్టారు. చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు, బుద్ధా వెంకన్న క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.