స్టాక్ మార్కెట్ల లాభాలకు బ్రేక్

17-09-2021 Fri 16:44
  • ఒకానొక సమయంలో 59,737 పాయింట్లను తాకిన సెన్సెక్స్
  • ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు
  • 125 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్ల జోరుకు ఈరోజు బ్రేక్ పడింది. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఒకానొక సమయంలో 59,737 పాయింట్లను తాకింది.

అయితే మధ్యాహ్నం తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో చివరకు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 125 పాయింట్లు నష్టపోయి 59,015కి పడిపోయింది. నిఫ్టీ 44 పాయింట్లు కోల్పోయి 17,585 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (5.26%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.51%), భారతి ఎయిర్ టెల్ (1.39%), మారుతి సుజుకి (1.13%), నెస్లే ఇండియా (0.95%).

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-3.57%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.07%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.66%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.96%), ఏసియన్ పెయింట్స్ (-0.91%).