ఎంఐఎం మోచేతి నీళ్లు తాగుతూ ఏడేళ్లుగా కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని మరిచారు: కిషన్ రెడ్డి

17-09-2021 Fri 14:21
  • నేడు విమోచన దినోత్సవాన్ని నిర్వహించిన బీజేపీ
  • జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కిషన్ రెడ్డి
  • విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్
Kishan Reddy comments on CM KCR

ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ నేతలు తెలంగాణ వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాదు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లోనూ, ప్రతి ఒక్క బస్తీలోనూ విమోచన దినోత్సవ వేడుకలను అధికారంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

అసలు, ఎంఐఎం పార్టీకి కేసీఆర్ కుటుంబం ఎందుకు జీ హుజూర్, సలాం అంటోందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎంఐఎం మోచేతినీళ్లు తాగుతూ కేసీఆర్ గత ఏడేళ్లుగా విమోచన దినోత్సవాన్నే మరిచారని విమర్శించారు. తెలంగాణలో సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.