Jogi Ramesh: చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారు, గూండాలు కలిసి దాడి చేశారు: జోగి రమేశ్

Chandrababu caste persons attacked me says Jogi Ramesh
  • చంద్రబాబు ఇంటివద్ద వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ
  • అయ్యన్న చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి 
  • చంద్రబాబును, లోకేశ్ ను ఏపీలో తిరగనివ్వబోమని హెచ్చరిక
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అమరావతిలోని చంద్రబాబు నివాసం వద్ద వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అక్కడ టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.

ఈ ఘటనపై జోగి రమేశ్ స్పందిస్తూ... తమ ఆరాధ్య దైవం జగన్ గురించి టీడీపీ నేతలు మాట్లాడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు సిగ్గులేదని... అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసన తెలియజేయడానికి వచ్చిన తమపై దాడి చేస్తారా? అని మండిపడ్డారు. గూండాలు, చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారు కలిసి దాడికి పాల్పడ్డారని అన్నారు.

ఇంట్లో పడుకోవడం కాదు చంద్రబాబూ... దమ్ముంటే బయటకు రా.. మా సత్తా ఏమిటో చూపిస్తామని జోగి రమేశ్ సవాల్ విసిరారు. నిన్ను, నీ కొడుకుని ఏపీలో తిరగనివ్వమని అన్నారు. తాము సభ్యత మరిచి ఎప్పుడూ మాట్లాడలేదని... టీడీపీ శ్రేణులు అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
Jogi Ramesh
YSRCP
Chandrababu
Nara Lokesh
Telugudesam

More Telugu News