జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
- కరోనా నిబంధనలు పాటించాలని ఆదేశం
- కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలి
- పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచన
కలెక్టర్లు, ఎస్పీలు, డీపీవోలు, జడ్పీ సీఈవోలతో ఏర్పాట్లపై చర్చించారు. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలన్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద మాస్కులు, భౌతిక దూరం వంటి కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లెక్కింపు సజావుగా సాగేలా చూడాలని, పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలిచ్చారు.