Andhra Pradesh: రెండున్నరేళ్లుగా గంజాయి వ్యాపారం బంద్​ అయ్యే సరికి అయ్యన్న అరుస్తున్నాడు: వైసీపీ నేతల సంచలన వ్యాఖ్యలు

Jogi Ramesh Sensational Comments On Ayyannapatrudu
  • కుమారుడితో కలిసి గంజాయి వ్యాపారం
  • ఉత్తరాంధ్ర ప్రజలు ఆయన గురించి నీచంగా మాట్లాడతారు
  • పేరులోనే అన్నం.. నోట్లో అంతా అశుద్ధమే
  • ఆయన్ను అశుద్ధంపాత్రుడుగా పిలవాలని మండిపాటు
టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిపై వైసీపీ ఎమ్మెల్యేలు జోగి రమేశ్, టీజేఆర్ సుధాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొద్దున లేస్తే చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కొడుకు చేసేది గంజాయి వ్యాపారమని మండిపడ్డారు. రెండున్నరేళ్లుగా ఆ వ్యాపారం బంద్ అయ్యేసరికి వారిద్దరూ గాడిదల్లా అరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల శివప్రసాద్ సంస్మరణ సభ సందర్భంగా సీఎం జగన్ పై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై వారు ఈ విమర్శలు చేశారు.

అయ్యన్నపాత్రుడి పేరులో అన్నం ఉందిగానీ.. నోట్లో అంతా అశుద్ధమేనని, ఇకపై ఆయన్ను అశుద్ధంపాత్రుడుగా పిలవాలని అన్నారు. ఆయన గురించి ఉత్తరాంధ్ర ప్రజలు చాలా నీచంగా చెబుతారన్నారు. చంద్రబాబు హయాంలో అయన్నపాత్రుడు కోట్లాది రూపాయల ప్రజధనాన్ని దోచుకున్నారని, చంద్రబాబు అవినీతిని బయటపెడుతున్నందుకే ప్రభుత్వంపై దూషణలకు దిగుతున్నారని విమర్శించారు.

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు చంద్రబాబు కారణమో కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలంతా ఈ విషయంపై కోడై కూస్తున్నారని అన్నారు. అయన్న తిట్టాల్సింది చంద్రబాబు, లోకేశ్ నని అన్నారు. హైకోర్టు తన తీర్పుతో బాబు, లోకేశ్ లను లెంపకాయ కొట్టిందన్నారు.
Andhra Pradesh
YSRCP
Jogi Ramesh
Ayyanna Patrudu
Telugudesam

More Telugu News