ఎగువ నుంచి భారీ వరద.. మరోసారి తెరుచుకున్న శ్రీశైలం గేట్లు

17-09-2021 Fri 11:51
  • ఏడు గేట్లు 10 అడుగుల మేర ఎత్తిన అధికారులు
  • నాగార్జున సాగర్ కు 1,95,881 క్యూసెక్కులు
  • జల విద్యుత్ ద్వారా మరో 58,561 క్యూసెక్కుల విడుదల
Srisailam at its full capacity 7 crest gates opened

శ్రీశైలం గేట్లు మరోసారి తెరుచుకున్నాయి. ఎగువ నుంచి వరద పోటెత్తుతుండడంతో అధికారులు ఇవాళ ఏడు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు. దిగువ నాగార్జునసాగర్ కు 1,95,881 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుదుత్పత్తి ద్వారా మరో 58,561 క్యూసెక్కులను వదులుతున్నారు.

ఎగువ జూరాల నుంచి శ్రీశైలానికి 1,25,731 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 38,799 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం నీటి మట్టం 884.80 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులో 214.3637 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి.