Pooja Hegde: పారితోషికంలో నయనతారను మించిపోయిన పూజ హెగ్డే!

Pooja  Hegde shocking remuneration for Pavan movie
  • తెలుగులో భారీ అవకాశాలు
  • వరుసగా దక్కుతున్న విజయాలు
  • పెరుగుతున్న డిమాండ్ 
  • పవన్ .. మహేశ్ సినిమాల్లో ఛాన్స్   
పూజ హెగ్డే ఇప్పుడు టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్ గా చక్రం తిప్పేస్తోంది. ఒక మాదిరి సినిమాలకు ఆమె డేట్లు దొరికే పరిస్థితి లేదు. తమిళ .. హిందీ ప్రేక్షకులకు కూడా ఆమె తెలుసు. అక్కడ కూడా తెలుగులో మాదిరిగానే తన దూకుడు చూపడానికి ఆమె రెడీ అవుతోంది.

అసలు పూజ హెగ్డే కెరియర్ తమిళ సినిమాతోనే మొదలైంది. జీవా సరసన చేసిన మొదటి సినిమాకి ఆమె అందుకున్న పారితోషికం 25 లక్షలని అంటారు. కానీ ఇప్పుడు విజయ్ జోడీగా ఆమె చేస్తున్న 'బీస్ట్' సినిమాకి అందుకుంటున్న పారితోషికం 5 కోట్లు అనే టాక్ వినిపిస్తోంది.

చాలా సినిమాలు చేసిన తరువాత నయనతార తన పారితోషికాన్ని 4 కోట్లకు తీసుకెళ్లింది. కానీ ఒక్క తెలుగులో మాత్రమే కాస్త స్టార్ డమ్ ఉన్న ఈ సుందరి మాత్రం అమాంతంగా 5 కోట్ల మార్క్ ను అందుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది. తెలుగులోనూ ఆమె అంతే మొత్తం వసూలు చేస్తోందని అంటున్నారు. పవన్ ... మహేశ్ సినిమాల కోసం కూడా ఆమె అంతే ఛార్జ్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఆ తరువాత స్థానాల్లో రష్మిక .. కీర్తి సురేశ్ ఉన్నారని చెప్పుకుంటున్నారు.
Pooja Hegde
Radhe Shyam
Most Eligible Bachelor

More Telugu News