Warangal: వరంగల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఫస్టియర్ విద్యార్థి దుస్తులు విప్పించిన సీనియర్లు

  • ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసిన సీనియర్లు
  • యూపీ రాజకీయ కుటుంబానికి చెందిన విద్యార్థి
  • విషయం తెలిసి తల్లిదండ్రుల సీరియస్
  • క్షమాపణలు చెప్పినా శాంతించని వైనం!
Raging in warangal KMC

వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో ర్యాగింగ్ మరోమారు కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ రాజకీయ కుటుంబానికి చెందిన విద్యార్థి జాతీయ కోటాలో సీటు సాధించి కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరాడు. ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అతడి దుస్తులు విప్పించి ర్యాంగింగ్ చేసినట్టు తెలుస్తోంది.

బాధిత విద్యార్థి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డీఎంఈ రమేశ్‌రెడ్డి బుధవారం వరంగల్ కేసీఎంసీకి వచ్చి ర్యాగింగ్ ఘటనపై ఆరా తీశారు. ఈ విషయమై కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ మాట్లాడుతూ.. ర్యాగింగ్ చేసిన విద్యార్థులు క్షమాపణ చెప్పడంతో వివాదం సమసిపోయిందన్నారు. మరోవైపు, బాధిత విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం వారి క్షమాపణతో శాంతించలేదని సమాచారం. ప్రస్తుతం వారు వరంగల్‌లోనే ఉన్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News