france: వ్యాక్సిన్ తీసుకోలేదని.. ఉద్యోగులపై ప్రభుత్వం గుస్సా

three thousand medical staff suspended due to refusal for vaccination
  • మూడు వేల మంది ఉద్యోగులపై వేటు
  • వెల్లడించిన ఫ్రాన్స్ ఆరోగ్యశాఖ మంత్రి
  • ఇప్పటివరకూ 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి
కరోనా టీకా తీసుకోని 3 వేల మంది ఉద్యోగులకు ఫ్రాన్స్ భారీ షాక్ ఇచ్చింది. ఏకంగా వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫ్రాన్స్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచం మొత్తాన్ని వణికించిన కొవిడ్ మహమ్మారిని నిరోధించేందుకు కొవిడ్ టీకా ఒక్కటే మార్గమని ప్రపంచ దేశాలన్నీ ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.

ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయా దేశాల ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశ ప్రజలంతా కొవిడ్ టీకా వేయించుకోవాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా తెలిపారు. ప్రధానంగా సెప్టెంబర్ 15లోగా ఆరోగ్య కేంద్రాల్లోని సిబ్బంది మొత్తం తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆదేశించారు.

అయితే వ్యాక్సిన్ వేయించుకోవడం ఇష్టంలేని ఆరోగ్య సిబ్బంది పదుల సంఖ్యలో తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఇక ఉద్యోగాల్లో కొనసాగుతూ నిర్ణీత గడువులోగా వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరించిన దాదాపు 3 వేల మంది సిబ్బందిని అక్కడి ప్రభుత్వం ఉద్యోగాల నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించింది.

వీరిలో అత్యధిక శాతం నర్సులే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఫ్రాన్స్ ఆరోగ్య శాఖా మంత్రి ఒలివియర్ వెరాన్ గురువారం వెల్లడించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఫ్రాన్స్‌ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది.
france
corona
vaccination
immanuel macron

More Telugu News