కేటీఆర్ ను విమర్శించిన రేవంత్ పై ధ్వజమెత్తిన తెలంగాణ మంత్రులు

16-09-2021 Thu 22:15
  • చిన్నారి హత్యాచారం ఘటనలో కేటీఆర్ తొందరపాటు
  • నిందితుడు అరెస్ట్ అంటూ ట్వీట్
  • అబద్ధాల కోరు అంటూ విరుచుకుపడిన రేవంత్
  • ఘాటుగా బదులిచ్చిన తలసాని, శ్రీనివాస్ గౌడ్
Telangana ministers counters Revanth Reddy who criticized KTR

చిన్నారిపై హత్యాచారం కేసులో కేటీఆర్ చేసిన ఓ పొరబాటు ట్వీట్ పై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పుట్టుకతోనే అబద్ధాల కోరు, దోపిడీదారు అంటూ కేటీఆర్ ను విమర్శించారు. దీనిపై తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్ ఘాటుగా స్పందించారు.

రేవంత్ రెడ్డి ఓ కార్టూన్ బొమ్మ లాంటివాడని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే కేటీఆర్ పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లొచ్చిన రేవంత్ రెడ్డి... కేటీఆర్ పై విమర్శలు చేయడమేంటి? అని వ్యంగ్యం ప్రదర్శించారు.

అటు, శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "రేవంత్ రెడ్డీ... నీకు పదవి నెత్తికి ఎక్కినట్టుంది అని మండిపడ్డారు. తిప్పికొడితే రెండు సంవత్సరాలు అయింది నువ్వు కాంగ్రెస్ లో చేరి... కాంగ్రెస్ తరఫున మూడు పర్యాయాలు ఎంపీ గా అనుభవం ఉన్న శశిథరూర్ గారిని డాంకీ అంటావా? ఓ సన్నాసికి పదవి ఇచ్చామని రాహుల్ గాంధీ ఇందుకే బాధపడుతున్నారా?" అంటూ రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు.