బాలుడ్ని లైంగికంగా వేధించిన ఆయాకు 20 ఏళ్ల జైలుశిక్ష

16-09-2021 Thu 20:48
  • హైదరాబాదులో ఘటన
  • పాతబస్తీలో ఓ స్కూల్లో చదువుతున్న బాలుడు
  • 9 ఏళ్ల బాలుడిపై పాతికేళ్ల ఆయా లైంగిక వేధింపులు
  • 2017లో కేసు నమోదు
  • తీర్పు వెలువరించిన బాలమిత్ర కోర్టు
Court imposed twenty year imprisonment in a harassment case

సభ్య సమాజం తలదించుకునేలా ఓ మైనర్ బాలుడ్ని లైంగికంగా వేధించిన ఆయాకు జైలుశిక్ష పడింది. హైదరాబాదులో ఈ లైంగిక వేధింపుల ఘటన జరిగింది. 9 ఏళ్ల బాలుడు పాతబస్తీలో ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. పాతికేళ్ల ఆయా బాలుడిని లైంగికంగా వేధించింది.

దీనిపై 2017లో చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నిందితురాలిపై పోక్సో చట్టం కింద అభియోగాలు మోపిన పోలీసులు, సాక్ష్యాధారాలు సమర్పించారు. ఈ కేసును విచారించిన బాలమిత్ర కోర్టు ఆయాకు 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది.