కొత్త దర్శకుడితో నాని కొత్త చిత్రం!

16-09-2021 Thu 17:47
  • రిలీజ్ కి రెడీగా 'శ్యామ్ సింగ రాయ్'
  • షూటింగు దశలో 'అంటే సుందరానికీ'
  • సుకుమార్ శిష్యుడికి ఛాన్స్ 
  • పరిశీలనలో 'దసరా' టైటిల్   
Nani new movie with new Director

నాని తాజా చిత్రంగా వచ్చిన 'టక్ జగదీశ్' మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. ఆయన తదుపరి సినిమా అయిన 'శ్యామ్ సింగ రాయ్' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేస్తున్న 'అంటే సుందరానికీ!' సెట్స్ పై ఉంది. ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాతో తెలుగు తెరకి నజ్రియా నజీమ్ కథానాయికగా పరిచయమవుతోంది.

ఆ తరువాత సినిమాను శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడితో నాని చేయనున్నట్టు తెలుస్తోంది. సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్ ఇటీవల నానీకి ఒక కథను వినిపించాడట. కథ బాగుండటంతో వెంటనే నాని ఓకే చేప్పాడని అంటున్నారు. తెలంగాణ నేపథ్యంలోని ప్రేమకథగా ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మించనున్న ఈ సినిమాకి 'దసరా' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఈ దసరాకి ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోనున్నట్టు తెలుస్తోంది.