పవన్ జోడీగా పూజ హెగ్డే ఖాయమైనట్టే!

16-09-2021 Thu 17:18
  • అఖిల్ జోడిగా 'బ్యాచ్ లర్'
  • ప్రభాస్ సరసన 'రాధే శ్యామ్'
  • లైన్లో మహేశ్ ..  త్రివిక్రమ్ మూవీ
  • మరోసారి హరీశ్ శంకర్ కి గ్రీన్ సిగ్నల్
Pooja Hegde in Pavan Kalyan movie

పూజ హెగ్డే జోరు మామూలుగా లేదు. స్టార్ హీరోలతో ఎడా పెడా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ప్రస్తుతం తెలుగులో ఆమె చేసిన రెండు సినిమాలు విడుదలకి సిద్ధమయ్యాయి. అఖిల్ జోడిగా చేసిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' అక్టోబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రభాస్ తో చేసిన 'రాధేశ్యామ్' సంక్రాంతి' కానుకగా జనవరి 14వ తేదీన విడుదల కానుంది.

ఈ  నేపథ్యంలో త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్లోని సినిమా కోసం కూడా ఆమెనే ఎంపిక చేసినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. పవన్ -  హరీశ్ శంకర్ సినిమాలోను కథానాయికగా ఆమె పేరే తెరపైకి వచ్చింది. హరీశ్ శంకర్ 'దువ్వాడ జగన్నాథం' సినిమాతోనే పూజ దశతిరిగింది.

ఆ తరువాత ఆయన ఆమెకి 'గద్దలకొండ గణేశ్'తో మరో హిట్ ఇచ్చాడు. ఇప్పుడు పవన్ తో చేయనున్న 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలో కూడా పూజ హెగ్డేను తీసుకోవడం ఖాయమైపోయిందని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని చెప్పుకుంటున్నారు.