CM Jagan: క్యాబినెట్ సమావేశంలో మంత్రులకు పలు సూచనలు చేసిన సీఎం జగన్

CM Jagan gives suggestions to ministers in cabinet meet
  • నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం
  • హాజరైన సీఎం జగన్, మంత్రులు
  • వైసీపీ ప్రజాప్రతినిధులకు సీఎం దిశానిర్దేశం
  • విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని స్పష్టీకరణ
  • క్షేత్రస్థాయిలో విరివిగా పర్యటించాలని సూచన
నేడు నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో సీఎం జగన్ మంత్రులకు పలు అంశాలపై సూచనలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని అన్నారు. పింఛన్ల విషయంలో విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని స్పష్టం చేశారు. పెన్షనర్ల జాబితాపై ప్రజలకు మరింత స్పష్టత నివ్వాలని తెలిపారు. అర్హులకు మేలు జరిగేలా లబ్దిదారుల ఎంపిక జరుగుతోందని ప్రజలకు వివరించాలని, ప్రభుత్వం పారదర్శకంగా పాలన సాగిస్తోందన్న విషయాన్ని వారికి అర్ధమయ్యేలా చెప్పాలని పేర్కొన్నారు.
CM Jagan
Suggestions
Ministers
Cabinet Meeting
YSRCP
Andhra Pradesh

More Telugu News