'బుల్లెట్ బండి' పాటకు స్టెప్పులేసిన ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అర్ధాంగి... వీడియో ఇదిగో!

16-09-2021 Thu 14:33
  • నారాయణస్వామి 42వ వివాహ వార్షికోత్సవం
  • తిరుపతిలో వేడుకలు
  • డిప్యూటీ సీఎం నివాసంలో కోలాహలం
  • కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించిన నారాయణస్వామి
AP Dy CM Narayana Swamy wife dances for Bullet Bandi song

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వివాహ వార్షికోత్సవం తిరుపతిలో ఘనంగా జరిగింది. 42వ పెళ్లిరోజు సందర్భంగా ఆయన నివాసంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో 'బుల్లెట్ బండి' పాటకు నారాయణస్వామి అర్ధాంగి స్టెప్పులేయడం విశేషం అని చెప్పాలి.

డిప్యూటీ సీఎం నారాయణస్వామి సోఫాలో కూర్చుని ఉండగా, ఆమె 'బుల్లెట్ బండి' పాటకు చక్కని అభినయంతో డ్యాన్స్ చేశారు. ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆమెతో కాలు కదపడంతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

ఇటీవల కాలంలో 'బుల్లెట్ బండి' పాట బాగా ప్రజాదరణ పొందింది. ఏ శుభకార్యంలో చూసినా ఈ పాట ఉండాల్సిందే అన్నట్టుగా జనాలను ఆకట్టుకుంది.