హత్యాచార నిందితుడు రాజు ఆత్మ‌హ‌త్య‌పై మెగాస్టార్ చిరంజీవి స్పంద‌న‌

16-09-2021 Thu 13:14
  • రాజు త‌న‌ను తాను శిక్షించుకున్నాడు
  • అంద‌రికీ ఊర‌ట క‌లిగిస్తోంది
  • మ‌రోసారి బాలిక‌ల‌పై దారుణాలు జ‌ర‌గకూడ‌దు
Lets not allow such dastardly acts to recur and lets do whatever it takes towards this goal says chiru
హైద‌రాబాద్‌లోని సైదాబాద్ బాలిక హ‌త్యాచార నిందితుడు రాజు రైల్వే ట్రాక్ పై ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై ప‌లువురు ప్ర‌ముఖులు స్పందిస్తున్నారు. ప్రముఖ సినీన‌టుడు చిరంజీవి తాజాగా రాజు ఆత్మ‌హ‌త్య‌పై స్పందిస్తూ... రాజు త‌న‌ను తాను శిక్షించుకోవ‌డం బాధిత బాలిక కుటుంబ స‌భ్యుల‌తో పాటు అంద‌రికీ ఊర‌ట క‌లిగిస్తోంద‌ని చెప్పారు. బాలిక‌ల‌పై దారుణ ఘ‌ట‌న‌లు మ‌రోసారి జ‌ర‌గ‌కూడ‌ద‌ని, అందుకు ప్ర‌జ‌లు చొర‌వ‌చూపాల‌ని ఆయ‌న కోరారు.

చిరంజీవి స్పంద‌న‌...