భారత్ బంద్ లో 19 పార్టీలు పాల్గొననున్నాయి: సీపీఐ నారాయణ

16-09-2021 Thu 12:30
  • ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు మోదీ సిద్ధమవుతున్నారు
  • ఎవడబ్బ సొమ్మని ప్రైవేటుకు అప్పజెపుతారు
  • మోదీ చెప్పినట్టుగా నిర్మలా సీతారామన్ ఆడుతున్నారు
19 parties are participating in Bharat Bandh says CPI Narayana
ఈ నెల 27న జరగనున్న భారత్ బంద్ కార్యక్రమంలో 19 పార్టీలు పాల్గొనబోతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. పబ్లిక్ సెక్టార్ కంపెనీలన్నింటినీ ప్రైవేటుపరం చేయడానికి ప్రధాని మోదీ సిద్ధమవుతున్నారని... ఎవడబ్బ సొమ్మని ప్రైవేటుకు అప్పజెపుతారని మండిపడ్డారు.

మోదీ రాజీనామా చేయాలనేదే భారత్ బంద్ ప్రధాన డిమాండ్ అని అన్నారు. మన దేశంలో నెంబర్ వన్ ఆర్థిక నేరస్థుడు మోదీనే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ చెప్పినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆడుతున్నారని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంటును అమ్మడానికి తాము ఒప్పుకోబోమని చెప్పారు.