KTR: హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్యపై కేటీఆర్ స్పందన

  • స్టేషన్ ఘన్ పూర్ వద్ద రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహం
  • రాజు మృతదేహాన్ని గుర్తించామని డీజీపీ తెలిపారన్న కేటీఆర్
  • రాజు ఆత్మహత్యపై సర్వత్ర ఆనందం
KTR response on rapist Raju suicide

హైదరాబాదులోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేసిన రేపిస్ట్ రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్టేషన్ ఘన్ పూర్ రైల్వే ట్రాక్ పై విగతజీవిగా కనపడ్డాడు. అతని చేతిపై ఉన్న 'మౌనిక' అనే పచ్చబొట్టు ఆధారంగా ఆ మృతదేహం రాజుదేనని పోలీసులు నిర్ధారించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చిన్నారిపై హత్యాచారం చేసిన దుర్మార్గుడిని ట్రేస్ చేశామని, అతని మృతదేహాన్ని స్టేషన్ ఘన్ పూర్ రైల్వే ట్రాక్ పై గుర్తించామని డీజీపీ తెలిపారని కేటీఆర్ ట్వీట్ చేశారు.

మరోవైపు రాజు ఆత్మహత్యకు పాల్పడటంపై అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాపం పండిందని వ్యాఖ్యానిస్తున్నారు. రాజు మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టంకు తరలిస్తున్నారు. రైల్వే ట్రాక్ పై మృతదేహం లభ్యం కావడంతో ఈ కేసును రైల్వే పోలీసులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. అయితే, రైల్వే పోలీసుల సహకారంతో తెలంగాణ పోలీసులు ఈ కేసును విచారించనున్నారు.

More Telugu News