Alia Bhatt: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ భామ 
  • ఊటీకి వెళుతున్న 'గాడ్ ఫాదర్'
  • ఓటీటీ ద్వారా మరో తెలుగు సినిమా  
Alia Bhat to be cast opposite NTR

*  ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో రూపొందే చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ భామ అలియా భట్ ను ఎంపిక చేసినట్టు తాజా సమాచారం. మరోపక్క, వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ చిత్రం షూటింగును నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగును హైదరాబాదుతో పాటు విదేశాలలో కూడా నిర్వహిస్తారు.  
*  మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడుగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న 'గాడ్ ఫాదర్' చిత్రం రెండో షెడ్యూలును ఈ నెల 21 నుంచి నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ షెడ్యూలును ఊటీలో చేస్తారని తెలుస్తోంది. వారం రోజుల పాటు ఈ షూటింగును నిర్వహిస్తారట.
*  ఇటీవలి కాలంలో ఓటీటీ ద్వారా డైరెక్ట్ రిలీజ్ అవుతున్న సినిమాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మరో తెలుగు సినిమా కూడా ఓటీటీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన 'ఆకాశవాణి' చిత్రాన్ని ఈ నెల 24న సోని లివ్ ద్వారా ప్రీమియర్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

More Telugu News